మర్రి రాజశేఖర్ రెడ్డికి సీఎం కేసీఆర్‌ బర్త్‌డే విషెస్‌..

608
Marri Rajashekar reddy
- Advertisement -

టీఆరెఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి నేడు తన జన్మదినం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలసి ఆయన ఆశీస్సులు తీసుకొన్నారు. అదేవిధంగా రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ను మరియు, రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్,మరియు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్‌లను కూడా ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మర్రి రాజశేఖర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -