శేరిలింగంపల్లిలో ఘనంగా కేసీఆర్ బర్త్ డే వేడుకలు

21
- Advertisement -

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఘనంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. శేరిలింగంపల్లి బీఆర్ఎస్ స్థానిక నేత మారబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు..జరుగగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు మాజీ రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా చాలెంజ్ ఫౌండర్ జోగినపల్లి సంతోష్ కుమార్..

శేరిలింగంపల్లి నియోజకవర్గానికి వచ్చిన సంతోష్ కుమార్ కి ఘనస్వాగతం పలికాయి బీఆర్ఎస్ శ్రేణులు. ఈ సందర్భంగా హరితసేన, గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి మజీద్ బండ ప్రభుత్వ పాఠశాలలో వృక్షార్చన కార్యక్రమంలో బాగంగా స్కూల్ విద్యార్థులతో కలిసి సంతోష్ కుమార్ మొక్కలు నాటారు..వృక్షార్చన కార్యక్రమం అనంతరం స్కూల్ విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు.

Also Read:హ్యాపీ బర్త్ డే…బాపు కేసీఆర్

అనంతరం శేరిలింగంపల్లి స్థానిక బీఆర్ఎస్ నేత రవి యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేశారు…ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సాయిబాబా, మాజీ బిసి కమిషన్ మెంబర్ కిషోర్ గౌడ్,గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, సుబ్బరాజు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నాయి.

- Advertisement -