ఎర్రవల్లిలో సీఎం కేసీఆర్….పనులపై ఆరా

275
kcr
- Advertisement -

సీఎం కేసీఆర్ ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కమ్యూనిటి హాల్స్, మిషన్ భగీరథ,కళ్యాణమండపానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. డబుల్ ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. కాలినడకన ప్రతి విధి తిరుగుతు పనుల పురోగతిపై ఆరాతీశారు. త్వరితగతిన పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

ఎర్రవల్లిలో అభివృద్ధి పనులను గతంలో స్వయంగా పరిశీలించారు సీఎం కేసీఆర్. అధికారులకు తగు సూచనలు చేసిన సీఎం….భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తకుండా నిర్మాణాలు ఉండాలని సూచించారు. సీఎం దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేట దేశానికే ఆదర్శ గ్రామాలుగా నిలవనున్నాయి.

kcr

ఇటీవలె ఎర్రవల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులను మధ్యప్రదేశ్‌ హౌసింగ్‌ ఇఫ్రా డెవలప్‌మెంట్‌ బోర్డు సబ్‌ ఇంజనీర్ల బృందం పరిశీలించింది. 6 మంది సబ్‌ఇంజనీర్ల బృందం గ్రామంలో పర్యటించి, జరుగుతున్న అభివృద్ధి పనులు, పనులు జరుగుతున్న తీరును గ్రామస్తులను అడిగితెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్‌బెడ్రూం ఇళ్లు అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. అలాగే కుంటల అభివృద్ధి, ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ పిలుపుతో సామూహికంగా గ్రామంలోని ప్రజలందరు పంటలను కోసి…..సమైక్యతను చాటిన సంగతి తెలిసిందే.

- Advertisement -