తిరుగులేని శక్తిగా…. టీఆర్ఎస్‌

282
- Advertisement -

సంక్షేమ పథకాల అమలు,అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం చరిత్ర సృష్టిస్తున్నది. రాష్ట్ర సాధనకోసం ఒక్కడై కేసీఆర్ మొదలు పెట్టిన ప్రస్థానం.. వందలమంది పిడికిళ్లెత్తి సాగించిన పోరాటం.. ఆత్మబలిదానాలు.. త్యాగాలకు ప్రతిఫలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఉద్యమనాయకుడికి పట్టం కట్టారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా నడిపిస్తు అహర్నిషలు శ్రమిస్తున్నారు సీఎం కేసీఆర్.

ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా వారి ముఖాల్లో చిరునవ్వులు నింపే విధంగా ఎలాంటి అవినీతికి తావు లేకుండా క్షేత్రస్ధాయిలో సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, తెలంగాణ అమరుల కుటుంబాలను ఆదుకోవడం, దళితులకు భూపంపిణీ, ఆసరా పెన్షన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, పేదవిద్యార్థులకు విదేశీ విద్య.. ఇలా అనేక పథకాలు ప్రభుత్వంపై కేసీఆర్‌ నాయకత్వంపూ ప్రజలకు నమ్మకాన్ని పెంచాయి. ఇక క్షేత్రస్ధాయిలో ప్రజల జీవన విధానం మెరుగుపడేందుకు వారి అభిప్రాయాలకు పెద్దపీట వేస్తూ 31 జిల్లాలను ఏర్పాటుచేస్తూ సీఎం కేసీఆర్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.

CM_KCR

ఫలితంగా స్వరాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్‌ విజయఢంకా మోగించింది. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచిన సందర్భంగా నిర్వహించిన సర్వేలో ప్రజలు ముక్తకంఠంతో కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చినట్లు ఓ సర్వేలో వెల్లడైంది.ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే తమ ఓటు టీఆర్‌ఎస్‌కేనని 109 నియోజకవర్గాల ప్రజలు ముక్తకంఠంతో నినదించారు.

CM-KCR-launches-

వివిధ సంక్షేమ పథకాల అమలుదాకా.. సీఎం పని తీరునుంచి.. స్థానిక ఎమ్మెల్యేల సామర్థ్యందాకా.. అనేక ప్రశ్నలతో సేకరించిన అభిప్రాయాలు.. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు తిరుగులేదని స్పష్టంచేస్తున్నాయి. జిల్లాల పునర్విభజనకు ముందు పది జిల్లాలను ప్రామాణికంగా చేసుకుని నిర్వహించిన ఈ సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీ ఓటు ఎవరికి? అని ప్రశ్నించగా.. 67.88% మంది టీఆర్‌ఎస్‌కేనని ఘంటాపథంగా తేల్చి చెప్పారని సర్వే వెల్లడించింది. టీఆర్‌ఎస్‌కు గత ఎన్నికల్లో 33.66% ఓట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయా నియోజకవర్గాలవారీగా తాజా ప్రజాస్పందనను పరిశీలిస్తే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 109 స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయ దుందుభి మోగిస్తుందని వెల్లడైంది.

ఐదు జిల్లాల్లో వందశాతం అసెంబ్లీ సీట్లు టీఆర్‌ఎస్‌కే దక్కుతాయని తేలింది. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష హోదా కలిగి ఉన్న కాంగ్రెస్‌కు ఆ హోదా పోవడంతోపాటు.. కనాకష్టంగా ఆ పార్టీ కేవలం రెండు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి ఉంటుందని సర్వే పేర్కొంది. హైదరాబాద్ పాతబస్తీలో బలమైన రాజకీయ శక్తిగా ఉన్న ఎంఐఎం ఏడు స్థానాలు గెల్చుకుంటుందని వెల్లడైంది. ఇక్కడ కూడా టీఆర్‌ఎస్ బలం నానాటికీ పెరుగుతున్నదని సర్వే పేర్కొనడం విశేషం.

CM_KCR

పది జిల్లాలకుగాను సగం జిల్లాల్లో టీఆర్‌ఎస్ ఓట్లశాతం 70శాతం పైనే ఉంటుందని తేలింది. ఇప్పటికిప్పడు ఎన్నికలు జరిగితే 22 నియోజకవర్గాల్లో 80శాతానికిపైగా టీఆర్‌ఎస్‌కు ఓట్లు లభిస్తాయని, అందులో 9 నియోజకవర్గాల్లో 90శాతంపైనే ఓటింగ్ లభిస్తుందని సర్వే వెల్లడించింది.

టీడీపీ, బీజేపీల ఉనికికే ప్రమాదం ఉందని సర్వేలో చెప్పింది. బీజేపీకి ఒక్క స్థానం దక్కే అవకాశముందన్న సర్వేలో… టీడీపీ గుండు సున్నా మిగులుతుందని తేలింది. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే 1983లో ఎన్టీఆర్ ప్రభంజనానికి మించి టీఆర్ఎస్ ఓట్ల సునామీ సృష్టిస్తుందని సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ సర్వే గణాంకాలతో సహా స్పష్టం చేసింది.

https://youtu.be/SBaC3wAEnps

- Advertisement -