మోడరేటర్‌గా ఎంపీ కవిత..

221
- Advertisement -

అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యులను చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఢిల్లీలోని పార్లమెంటరీ సెంట్రల్ కమిటీ హాల్ జాతీయ ప్రజా ప్రతినిధుల సదస్సు జరిగింది. ఈ సదస్సుకు మోడరేటర్‌గా ఎంపీ కవిత వ్యవహరించగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

దేశ సమగ్రాభివృద్ధి కోసం అందరు కృషిచేయాలని..రాష్ట్రాల మాదిరిగానే దేశాల మధ్య పోటీ ఉంటుందన్నారు. పోటీతత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఒక్కోసారి కొన్నిరంగాల్లో రాణించినా మరో రంగంలో వెనుబడిపోవచ్చని…ఆ లోపాలను సరిదిద్దుకుంటే విజయం సాధిస్తామన్నారు.

మోడరేటర్‌గా ఎంపీ కవిత..దేశంలో అభివృద్ధి చెందిన జిల్లాతో పోలిస్తే మనం ఎక్కడున్నామో గమనించాలన్న మోడీ…అందుకు అనుగణంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో ప్రజలను భాగస్వామ్యం చేయడంలో కలెక్టర్ల పనితీరు కీలకమని…వారి పనితీరు ఆధారంగానే బదిలీలు ఉంటాయన్నారు. ఇక సదస్సులో ఎంపీ కవిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మోడరేటర్‌గా తన మాటతీరుతో సభ్యులను మంత్రముగ్దులను చేసింది.

- Advertisement -