కేటీఆర్‌కు రాఖీ కట్టిన కవిత..

10
- Advertisement -

165 రోజుల తర్వాత హైదరాబాద్‌లో తన ఇంటికి చేరుకున్నారు ఎమ్మెల్సీ కవిత. మార్చి 15న రాత్రి 7: 15కి ఇంటి నుంచి డిల్లీకి వెళ్లిన కవిత … మళ్ళీ 7: 15కి తన నివాసానికి చేరుకున్నారు. తన ఇంటికి చెరుకున్న అనంతం సోదరుడు కేటీఆర్ కు రాఖీ కట్టారు. తన కుటుంబ సభ్యులను ఆలింగనం చేసుకున్నారు. తల్లి శోభమ్మ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు కవిత.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితకు మంగళహారతి ఇచ్చి ఇంట్లోకి స్వాగతం పలికారు కుటుంబ సభ్యులు. కుటుంబ సభ్యులను చూసి ఆలింగనం చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. పూజ గదిలో దేవుని చిత్రపటాల ముందు మొకరిల్లి నమస్కరించారు కవిత.

Also Read:శంషాబాద్‌లో ఎమ్మెల్సీ కవితకు ఘనస్వాగతం..

- Advertisement -