లండ‌న్‌లో అటుకుల బతుకమ్మ

301
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మను ఆడిన ఆడపడుచులు రెండో రోజు అంగరంగ వైభవంగా అటుకుల బతుకమ్మను ఆడుకున్నారు. తెలంగాణ ఆడపడుచులు ఖండాంతరాల్లో బతుకమ్మ వేడుకలు ఆడి ఇక్కడి సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్తున్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో పాటలతో తెలంగాణ మార్మోగిపోతోంది.

bathukamma in london

టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎంగిలి పూల బతుకమ్మను దుబాయ్‌లో నిర్వహించారు.తొమ్మిది రోజుల పాటు జ‌రిగే బ‌తుక‌మ్మ పండగలో భాగంగా రెండవ రోజు అయిన శ‌నివారం లండ‌న్‌లో ఘ‌నంగా బ‌తుక‌మ్మను నిర్వ‌హించింది. ఈ సంబురాల‌కు తెలంగాణ జాగృతి వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షురాలు, నిజామాబాద్ ఎంపి శ్రీమ‌తి క‌ల్వ‌కుంట్ల క‌విత ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. నిన్న యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌లోని ఆల్ ఉమ్ క్వ‌యిన్‌లో జ‌రిగిన ఎంగిలిపూల బ‌తుక‌మ్మ‌కు హాజ‌ర‌యిన ఆమె ఇవాళ ఉద‌యం యూకెలోని హీత్రూ విమానాశ్ర‌యం చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా క‌విత‌ను యూకె జాగృతి శాఖ ప్ర‌తినిధులు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు.

bathukamma celebrations

తెలంగాణ జాగృతి యూకె అధ్య‌క్షుడు సంప‌త్ ద‌న్న‌మ‌నేని నివాసంలో క‌ల్వ‌కుంట్ల క‌విత బ‌తుక‌మ్మ‌ల‌ను త‌యారు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో జాగృతి మ‌హిళా విభాగం స‌భ్యులు పాల్గొన్నారు. అక్క‌డ దొరికే రంగురంగుల పూల‌తో తొమ్మిది వ‌రుసుల్లో బ‌తుక‌మ్మ‌ను గో్పురంగా పేర్చారు క‌విత‌. బాలిక‌ల‌కు బ‌తుమ్మ‌ను త‌యారు చేయ‌డం ఎలాగో చెప్తూ…వారి చేత చిన్న బ‌తుక‌మ్మ‌ల‌ను పేర్చించారు. అనంత‌రం ప‌సుపుతో గౌర‌మ్మ‌ను త‌యారు చేసి…కుంకుమ పెట్టారు. శుభ్రం చేసిన దేవుడి గ‌ది ముందు బ‌తుక‌మ్మ‌ల‌ను పీట‌ల‌పై పెట్టి..అగ‌రువ‌త్తుల‌ను వెలిగించి …గౌరీ దేవికి మొక్కారు క‌విత‌. బ‌తుక‌మ్మ‌ల‌ను త‌యారు చేస్తున్నంత సేపూ క‌విత బ‌తుక‌మ్మ పాట‌ల‌ను పాడారు. చాలా ఏళ్ల నుంచి లండ‌న్‌లో ఉంటుండ‌టం చేత బ‌తుక‌మ్మ పాట‌ల‌ను వారు మ‌ర్చిపో్యారు. దీంతో వారికి పాత పాట‌ల‌తో పాటు కొత్త పాట‌ల‌ను కూడా పాడుతూ వారితో కూడా పాడించారు. క‌విత ఉత్సాహాన్ని చూసిన చుట్టుప‌క్క‌ల నివ‌సించే ఇత‌ర రాష్ట్రాల వారు సైతం ఉత్సాహంగా ఉయ్యాలో…అంటూ గొంతు కల‌ప‌డం విశేషం.

kavithakka

ఈస్ట్ హామ్‌లో సంబురాలు
లండ‌న్ ఈస్ట్ హామ్‌లో బ‌తుక‌మ్మ‌ ఆటా-పాట‌కు వేదిక‌యింది. బ‌తుక‌మ్మ ఆట‌-ఉయ్యాల పాట‌ల‌త‌తో వైట్ హౌజ్ ప్రాంగ‌ణం కొత్త శోభ‌ను సంత‌రించుకుంది. బ‌తుక‌మ్మ వేడుక‌ల‌కు న్యూహాం, వెస్ట్ హాం, వెస్ట్ లండ‌న్ పార్ల‌మెంటు స‌భ్యులు స్టీఫెన్ టిమ్స్ ,లిన్ బ్రౌన్‌, రూత్ కాడ్‌బ‌రీ, లార్డ్ దొల‌కియా, లామ్‌బాత్‌ మేయ‌ర్ స‌లేహా జాఫ‌ర్, ఇండియ‌న్ హై క‌మిష‌న్ కార్య‌ద‌ర్శి విజ‌య్ వ‌సంత్ ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ జాగృతి యూకె శాఖ అధ్య‌క్షుడు సంప‌త్ ద‌న్న‌మ‌నేని, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్ర‌వ‌ణ్ రెడ్డి, ఉపాధ్య‌క్షుడు సుమ‌న్ బ‌ల్మూరి, సుష్మ జువ్వాడి, సంతోష్ కుమార్‌, పావ‌ని గ‌ణేశ్‌, ప్ర‌శాంత్ పూస‌, ర‌ఘు జ‌క్కుల‌, కిశో్ర్ కుమార్, క‌త్తి పావ‌ని, వంశీ , స‌లామ్‌ యూసుఫ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

అమెరికాలో మూడవరోజు బతుకమ్మ

అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ఫ్రిమోంట్ లో జరగబోయే మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ వేడుకల్లో కవిత పాల్గొననున్నారు. ఈ మేరకు తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 2వ తేదీ మధ్యాహ్నం 3గం.ల నుంచి సాయంత్రం 7గం.ల వరకు రాయల్ ప్యాలెస్ వేదికగా ఈ మెగా బతుకమ్మ సంబరాలు మరియు దసరా పండుగ కార్యక్రమం జరగనుంది. తెలంగాణ జాగృతి మరియు అమెరికన్ కల్చరల్ అసోసియేషన్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ తెలిపింది.

- Advertisement -