MLC Kavitha: కేసీఆర్ బిడ్డను..తప్పు చేయను

8
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తీహార్ జైలు నుండి బయటకు వచ్చారు ఎమ్మెల్సీ కవిత. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత..తాను కేసీఆర్ బిడ్డనని..ఎలాంటి తప్పు చేయనని తేల్చిచెప్పారు.

పద్దెనిమిదేండ్లు రాజకీయాల్లో ఉన్న.. ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన.. ఒక తల్లిగా ఐదున్నర నెలలు పిల్లలను, కుటుంబాన్ని వదిలి ఉండడమన్నది చాలా ఇబ్బందికర విషయం అన్నారు. తన కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేసినవారికి తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తం.. సమయం వస్తది.. తప్పకుండా చెల్లిస్తం అని తేల్చిచెప్పారు.

ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తం..పోరాటం నా రక్తంలోనే ఉందన్నారు. న్యాయం కోసం పోరాడుతం,రాజకీయంగా యుద్ధం చేస్తం అన్నారు. కష్టకాలంలో తన కుటుంబానికి తోడున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. నేను మొండిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిన్రు అని తెలిపారు. అన్యాయంగా రాజకీయ కక్షసాధింపులో భాగంగా కేసీఆర్‌ బిడ్డను ఇబ్బంది పెట్టడం ద్వారా కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతో జైలుకు పంపారు అని స్పష్టం చేశారు.

Also Read:CM Revanth: సెప్టెంబర్ 17 నుంచి ప్రజా పాలన

- Advertisement -