కేసులతో వేధిస్తే ఊరుకోం: కవిత

6
- Advertisement -

కేసులతో బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే ఊరుకోబోము అని తేల్చిచెప్పారు ఎమ్మెల్సీ కవిత. జగిత్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశంలో మాట్లాడిన కవిత..కేసీఆర్ ను సీఎం మొక్క అనడం హాస్యాస్పదం అన్నారు. కేసీఆర్ మొక్క కాదు… వేగు చుక్క. రేవంత్ రెడ్డి గురువులకే చుక్కలు చూపించి తెలంగాణ తెచ్చిన శక్తి కేసీఆర్ అన్నారు.

మోదీ ప్రభుత్వం చేనేతపై జీఎస్టీ విధించడం దౌర్భాగ్యం అన్నారు. తెలంగాణ అధికారంలోకి వస్తే చేనేతపై జీఎస్టీని రియింబర్స్ చేస్తామన్న రాహుల్ గాంధీ హామీ ఏమైంది ? అని ప్రశ్నించారు.

తెలంగాణ ఉద్యమ కాలం నుంచీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎన్నో కష్టాలకోర్చి పనిచేసిన చరిత్ర అని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ తట్టుకొని నిలబడిందని స్పష్టం చేశారు. ఇప్పుడు కూడా అదే స్పూర్తిగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. కష్టకాలంలో పార్టీ కోసం పని చేసే వారే నిజమైన కార్యకర్తలని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను, హామీలను విస్మరించిన తీరును ప్రజల్లో ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు.

Also Read:4 నుండి తెలంగాణ జాగృతి సమీక్షా సమావేశాలు

- Advertisement -