ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు!

5
- Advertisement -

మాజీ మంత్రి కేటీఆర్‌పై ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆమె ఆరోపించారు.

వాళ్ల మీద, వీళ్ల మీద కేసులు పెట్టడమే బీజేపీకి ఉన్న పని… బీజేపీ, కాంగ్రెస్ కలిసి ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు అని కవిత విమర్శించారు. తెలంగాణలో ప్రతిపక్ష నాయకులపై పెడుతున్న ఈ అక్రమ కేసులే, దేశంలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయనడానికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని…ఏం జరుగుతుందో ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు అని ఆమె వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టడం ద్వారా వారిని అణగదొక్కాలని చూస్తున్నాయని, అయితే ప్రజలు అన్నీ చూస్తున్నారని ఆమె హెచ్చరించారు.

Also Read:బిల్లుల ఆమోదంపై సుప్రీం కీలక తీర్పు

- Advertisement -