- Advertisement -
తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని తెలిపిన వివరాల ప్రకారం, దోహా ఖతర్‌లో కరోనా, లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి పని లేక, జీతం లేక తినడానికి తిండి లేక అవస్థ పడుతున్న కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల చెందిన 15 మంది వలస కార్మికులకు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బాసటగా నిలిచారు.
కవిత ఆదేశాల మేరకు తెలంగాణ జాగృతి ఖతర్ నాయకులు హరికా ప్రేమ్,స్వప్న కేశా,శ్రీకాంత్ కొమ్ముల,ఎల్లయ్య తాళ్ళపెళ్లి మరియు సంజయ్ థామస్,శ్రావణి కొండోజుల సహకారంతో నిత్యావసర సామగ్రిని అందజేయడం జరిగింది. కరోనా వల్ల కార్మికులు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారని, తొందరగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ వలస కార్మికులను వెనక్కు తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని నందిని కోరారు.
- Advertisement -