యువతులకు అండగా మాజీ ఎంపీ కవిత..

262
k kavitha
- Advertisement -

లాక్ డౌన్ కారణంగా మహారాష్ట్రలోని సోలాపూర్‌లో చిక్కుకుపోయిన 68 మంది యువతులకు అండగా నిలిచారు మాజీ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు కవిత. మహారాష్ట్ర అధికారులతో మాట్లాడి, వీరి ప్రయాణానికి 3 బస్సులు ఏర్పాట్లు చేసారు. హైదరాబాద్‌లో ఇందిరాపార్కులో వారిని రిసీవ్ చేసుకొని వారికి ఇందిరా పార్కులో లంచ్ ఏర్పాట్లు చేసిన ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్.భోజనం అనంతరం వారి సొంత జిల్లాలకు పంపించారు జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి,ఉపాధ్యక్షుడు రాజీవ్ సాగర్.ఈ సందర్భంగా కవిత తీసుకున్న చొరవకు కృతజ్ఞతలు యువతులు తెలిపారు.

ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. 69 మంది యువతులు మహారాష్ట్ర సోలాపూర్‌లో పని చేస్తున్న సోదరీమణులు కవిత గారి చొరవతో నేడు తెలంగాణ చేరుకున్నారు.మహారాష్ట్రతో తెలంగాణకు సంబంధాలు ఉన్నాయి. ఇక్కడి నుండి అక్కడికి పనుల నిమిత్తం వెళ్లారు.మహారాష్ట్రకు తెలంగాణకు విడదీయరాని బంధం ఉంది. వీరి సమస్యలు తెలుసుకొని తెలంగాణకు తీసుకువచ్చిన కవితకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.టీఆరెస్ తరపున వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

telangana womens

తెలుగు జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి మాట్లాడుతూ.. మహారాష్ట్ర సోలాపూర్ నుండి 3 బస్సుల ద్వారా ఈ రోజు 68 మంది యువతులను తెలంగాణకు తీసుకు వచ్చాం. వీరంతా కవిత గారికి ట్విట్టర్‌లో తమ సమస్యలు చెప్పుకోవడం జరిగింది. అక్కడి స్థానిక ప్రజాప్రతినిధులతో,అధికారులతో మాట్లాడి వీరిని సురక్షితంగా తెలంగాణకు తీసుకురావడం జరిగింది.జహీరాబాద్‌లో వీరికి హోమ్ క్వరంటాయిన్ స్తాంప్ వేయడం జరిగింది. ఇక్కడి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వీరు ఇంటికి చేరగానే హోమ్ క్వరంటాయిన్ ఉంటారని తెలిపారు.

జాగృతి తరపున వీరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నాం.ఇప్పటికే అమరావతి నుండి రెండు రోజుల క్రితం 60 మందిని నిన్న 220 మంది వచ్చారు.జాగృతి తరపున వీరికి బోజనం,త్రాగునీరు స్నాక్స్ ఏర్పాటు చేసి వారి స్వస్థలాకు సురక్షితంగా పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

- Advertisement -