బీజేపీకి చిత్తశుద్ది ఉంటే పీవీకి వెంటనే భారతరత్న ఇవ్వాలి- కవిత

154
kavitha
- Advertisement -

బీజేపీకి చిత్తశుద్ది ఉంటే మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు వెంటనే భారతరత్న ప్రకటించాలన్నారు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గ్రేట‌ర్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా గురువారం కవిత ముషీరాబద్‌,గాంధీనగర్‌ డివిజన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రికి భారతరత్న ఇవ్వాలన్నారు. బీజేపీ చెప్పుతున్న అసత్యాలను హైదరాబాద్ ప్రజలు నమ్మరు. రాష్ట్ర ప్రభుత్వాలు నివేదిక పంపకుండానే, కేంద్ర హోంశాఖ, 6 రాష్ట్రాలకు రూ.4700 కోట్ల తక్షణ వరద సాయం అందించలేదా..? అని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డిని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.

- Advertisement -