Kavitha: బెయిల్ పిటిషన్‌ వెనక్కి తీసుకున్న కవిత

7
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత తన బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. సీనియర్ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో నిన్న కేసును వాయిదా వేయాలని కోరారు కవిత తరఫు న్యాయవాది. బెయిల్ కోసం త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

లిక్కర్ స్కాం కేసులో మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేశాయి. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉన్నారు. ఇక తిహార్‌ జైల్లో కవితతో కేటీఆర్, హరీష్‌రావు ములాఖత్ అయ్యారు. అనంతరం సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కు తీసుకున్నారు.

Also Read:KCR:జయశంకర్ సార్ అడుగు జాడల్లోనే రాష్ట్ర సాధన

- Advertisement -