తేజ దర్శకత్వంలో కవచం జోడి..!

445
Kajal bellamkonda srinivas
- Advertisement -

బెల్లంకొండ సాయి శ్రీనివాస్-కాజల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం కవచం. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో బెల్లంకొండ-కాజల్ కాంబినేషన్‌ చూడముచ్చటగా ఉంది. అంతేగాదు వీరిద్దరి లుక్స్‌కు సంబంధించిన ఫోటోలు ఫ్యాన్స్‌ను కట్టిపడేశాయి.

తాజాగా వీరి కాంబినేషన్‌లో మళ్లీ సినిమా రాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది కాజల్. అయితే ఆ చిత్రం వివరాలు మాత్రం చెప్పలేదు. అయితే ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తేజ-కాజల్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు పెద్ద హిట్ సాధించాయి. మరోసారి తేజ-కాజల్ తో కాజల్-శ్రీనివాస్  కాంబినేషన్‌ లో వస్తున్న ఈ భారీ అంచనాలు నెలకొన్నాయి.

యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న కవచంపై ఈ జోడి భారీ ఆశలు పెట్టుకుంది. టీజర్,ఫస్ట్ లుక్‌తో ఇప్పటికే అంచనాలను పెంచేసింది. టీజర్‌కు ఏకంగా 10 మిలియిన్ డిజిటల్ వ్యూస్‌ సాధించి ప్రేక్షకుల మన్ననలు పొందింది.ఈ సినిమాతో శ్రీ‌నివాస్ మామిళ్ళ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతుండగా కెరీర్‌లో తొలిసారి ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు.

Image result for kajal bellamkonda srinivas

- Advertisement -