కౌశిక్ దర్శకత్వంలో బెల్లంకొండ!

7
- Advertisement -

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ వరుస సినిమాలో బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. ఇప్పటికే సాగర్ కె చంద్ర దర్శకత్వంలో టౌసన్ నాయుడు సినిమా చేస్తుండగా తాజాగా మరో సినిమాకు కమిట్ అయ్యారు. చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో తన 11వ సినిమాకు ఓకే చెప్పారు బెల్లంకొండ శ్రీనివాస్.

ఇవాళ అన్న‌పూర్ణ స్టూడియోస్ లో ఈ చిత్ర షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాలో అందాల భామ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా, అజ‌నీష్ లోక్ నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ పై సాహు గార‌పాటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఇక బెల్లంకొండ శ్రీనివాస్ #BSS10 హై బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ చిత్రానికి ‘టైసన్ నాయుడు’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ని పెట్టారు. ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా, కిరణ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌లుగా వ్యవహరిస్తున్నారు. విజయ్, వెంకట్, రియల్ సతీష్ యాక్షన్ పార్ట్‌ను పర్యవేక్షిస్తున్నారు.

Also Read:లండన్‌లో “తెలంగాణ డే” వేడుకలు

- Advertisement -