పార్టీ మారిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే తెలంగాణ భవన్‌కు రావాలని సవాల్ విసిరారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన కౌశిక్.. ఈ రాష్ట్రంలో చీరలు, గాజుల సంస్కారం నేర్పించిందే సీఎం రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏబీఎన్‌లో ఇంటర్వ్యూ ఇచ్చి బీజేపీ అభ్యర్థి రాజేందర్ గెలుస్తాడని రేవంత్ రెడ్డి చెప్పడం కరెక్టేనా చెప్పాలన్నారు. కౌశిక్ రెడ్డి గొప్పోడా.. పార్టీలు మారిన గాంధీ గొప్పోడా.. బ్రోకర్ ఎవరనేది ప్రజలు నిర్ణయించుకుంటారు తెలిపారు. అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే తెలంగాణ భవన్‌కు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ వద్దకు పోదాం. లేదు కాంగ్రెస్‌లోకి పోయినవ్ అనుకుంటే రాజీనామా చేయ్ అన్నారు. నీవు మాట్లాడిన మాటలకు నీ విజ్ఞతకే వదిలేస్తున్నా… మైనంపల్లి హన్మంత్ రావు అల్వాల్‌లో మీటింగ్ పెట్టి ఇదే విధంగా కేటీఆర్‌ను దూషించారు. 50 వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు అని చెప్పారు కౌశిక్.
చీర కట్టుకుని గాజులు వేసుకుని బస్సెక్కమని మా పార్టీ నేతలను అవమానించేలా మాట్లాడారు. ఈ రాష్ట్ర సీఎం మాట్లాడినప్పుడు కరెక్టే అనిపించింది. అందుకే రేవంత్‌నే ఫాలో అవుతున్నాం అన్నారు. తాను బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు.. కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఐదుగురు ఎమ్మెల్యేలే.. నేను పది మందిని ఎలా తీసుకువస్తాను..? చెప్పాలన్నారు. తాను కాంగ్రెస్ పార్టీకి మోసం చేయలేదన్నారు కౌశిక్ రెడ్డి. రేవంత్ పీసీసీ కావడానికి నేనేం సహాయం చేశానో ఆయన్నే గాంధీ అడగాలని చురకలు అంటించారు.
Also Read:డ్రగ్స్ తీసుకున్న హేమ..పోలీసుల ఛార్జ్‌షీట్