BRS: దళిత బంధు ఇవ్వాల్సిందే

5
- Advertisement -

దళిత బంధు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కౌశిక్.. ప్రభుత్వం ఉన్నప్పుడు దళితలు గొప్పగా ఉండాలని గొప్ప ఆలోచనతో దళిత బంధు పధకాన్ని పెట్టారు…పైలట్ ప్రాజెక్ట్ కిందా హుజురాబాద్ లో ప్రారంభించారు కేసీఆర్ అన్నారు. 5 వేల మందికి రెండు విడత దళిత బంధు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఆ డబ్బు లబ్ధిదారులు అకౌంట్లో ఉన్నాయి ఎందుకు విడదల చేస్తలేరు అన్నారు. దళిత బంధు విషయంలో ఎందుకు రాజకీయం చేస్తున్నారు అన్నారు.

అసెంబ్లీ సాక్షిగా దళిత బంధు ఇవ్వాలని మాట్లాడిన…హుజురాబాద్ దళిత కుటుంబాలు మా పక్షాన ఉండి పోరాటం చేయాలనీ నా దగ్గర కి వచ్చారు అన్నారు. 2500 దళిత కుటుంబాలు నిరసనకు వచ్చారు…వాళ్ళతో పాటు వెళ్లడం జరిగిందన్నారు. దళిత పక్షాన నేను నిలబడి మాట్లాడితే నా పైన దాడి చేస్తారా…మీరు నన్ను ఎంత ఇబ్బంది పెటీయినా సరే వాళ్ళ పక్షాన పోరాటం చేస్తాను అన్నారు.

దళిత బంధు అనేది ఒక్క గొప్ప స్కీం…దళిత బంధు స్కీం అనేది రాజకీయం కోసం పెట్టలేదు అన్నారు. ప్రతి పక్ష ఎమ్మెల్యేగా భట్టి విక్రమార్కు ఉన్నప్పుడు వారి నియోజకవర్గంలో కూడా దళిత బంధు ఇవ్వడం జరిగిందన్నారు. రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను దళిత బంధు అడుగుతే కొడతారు, దళిత బంధు ఇవ్వకపోతే సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర పరిణామాలు ఎదుర్కోంటారు అన్నారు. కఠిన చర్యలు తీసుకుంటాం అని బెదిరిస్తున్నారు…నన్ను జైలు కు పంపిన సరే నా హుజురాబాద్ ప్రజలు కోసం సిద్ధం అన్నారు.

Also Read:దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలిపాం: కేటీఆర్

- Advertisement -