Kaushik Reddy:పొన్నం నుండే బ్లాక్ బుక్‌ స్టార్ట్

14
- Advertisement -

మంత్రి పొన్నం ప్రభాకర్‌ నుండే బ్లాక్ బుక్ స్టార్ట్ చేస్తామని తెలిపారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. హైదరాబాద్‌ ఫిలీంనగర్‌లోని వెంకటేశ్‌వరస్వామి ఆలయానికి చేరుకున్న కౌశిక్ రెడ్డి…పొన్నం ఇక్కడికి రాకపోతే తప్పు ఒప్పుకున్నట్లేనని వెల్లడించారు. పొన్నం రూ.100 కోట్ల కుంభకోణం చేశాడని నిరూపితమైందని అన్నారు.

మంత్రి పొన్నం వర్సెస్ కౌశిక్‌గా కరీంనగర్ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. నిన్న వీణవంకలోని తన ఇంటి వద్ద తడివస్త్రాలతో ప్రమాణం చేసిన కౌశిక్ తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పారు. తాను ఎవరి వద్ద వసూళ్లకు పాల్పడలేదని… కాంగ్రెస్‌ నాయకులు చేసిన ఆరోపణలకు తన నియోజకవర్గ ప్రజలకు జవాబుదారీగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ప్రమాణం చేస్తున్నానని చెప్పారు.

మంత్రికి మరో అవకాశం ఇస్తున్నానని, తనతో కలిసి హైదరాబాద్‌ అపోలో వెంకటేశ్వరస్వామి గుడికి రావాలని…, రూ.100 కోట్ల అవినీతి చేయలేదని నిరూపిస్తే బహిరంగ క్షమాపణ చెబుతానని వెల్లడించారు.

Also Read:లోక్ సభ స్పీకర్‌గా ఓంబిర్లా ఎన్నిక

- Advertisement -