కౌశిక్ రెడ్డిపై కేసు..ఏఏ సెక్షన్ల కింద అంటే!

5
- Advertisement -

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు అయింది. క్రైం నెంబర్ 1127/ 2024 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. తమ విధులకు ఆటంకం కలిగించాడని బంజారాహిల్స్ సిఐ ఫిర్యాదు చేశారు. అత్యవసర విధులకు హాజరు కావాల్సి ఉండగా వాహనాన్ని అడ్డగించారాని సిఐ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.

దుర్భాషలాడుతూ బెదిరింపు లకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు సీఐ. తన అనుచరులతో కలిసి పిఎస్ లో దౌర్జన్యం చేశాడని సీఐ ఫిర్యాదు చేయగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల పైన కేసు నమోదు 57,126 (2) 132 ,224,333,351,(3)191( 2) R/W 190 R/W 3 (5) కింద కేసు నమోదు చేశారు.

ఇవాళ ఉదయం కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయగా బంజారాహిల్స్ పీఎస్‌కు తరలించారు. గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులను తరలించారు.

Also Read:మాజీ మంత్రి హరీశ్‌ రావుకు బిగ్ రిలీఫ్

- Advertisement -