‘అలా ఎలా’ చిత్రంలో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ హెబ్బా పటేల్..కుమారి 21ఎఫ్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాతో తన నటన, అందంతో కుర్రకారు మతిపోగొట్టేసింది. ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు పెద్దగా ఆడక పోవడంతో అవకాశాలు రాలేదు. కిందతేడాది ‘24 కిసెస్’తో బాగా హీటెక్కించిన హెబ్బా.. సినిమా విడుదల తరవాత ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది.
ఇక ఆ సినిమా తరవాత హెబ్బాకు మళ్లీ అవకాశం రాలేదు. బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ దర్శకత్వంలో నటించనుంది హెబ్బా. బిగ్ బాస్ 2 తర్వాత కౌశల్ కు చాలా పాపులారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. కౌశల్ దర్శకత్వంలో హెబ్బా పటేల్ నటించింది సినిమాలో కాదు.. యాడ్ లో. కౌశల్‌కు యాడ్ ఫిల్మ్ ఏజెన్సీ ఉన్న విషయం తెలిసిందే.
సినిమాల్లో యాక్టింగ్ తో పాటు యాడ్ లు కూడా తీసేవాడు కౌశల్. శ్రీరామ్ గోల్డ్ లోన్ యాడ్‌ను హెబ్బా పటేల్‌పై చిత్రీకరిస్తున్నట్టు కౌశల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఆమెతో సెల్ఫీ దిగిన ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కౌశల్.. ‘‘టైటిల్స్ వస్తుంటాయి, పోతుంటాయి. కానీ, నా బహుముఖ ప్రతిభ ఎప్పటికి ఒకేలా ఉంటుంది . శ్రీరామ్ గోల్డ్ లోన్ యాడ్ ఫిల్మ్ కోసం హెబ్బా పటేల్‌ను డైరెక్ట్ చేస్తున్నాను’’ అని ఇస్ట్రాగ్రామ్ ద్వారా తెలియజేశారు కౌశల్.