ప్రభాస్ మూవీలో కత్రినా ఐటం సాంగ్..!

187
Katrina
- Advertisement -

డార్లింగ్‌ ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్’ సినిమా షూటింగులో బిజీగా ఉన్న విషయం తెలిసింది. ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా శ్రుతి హాసన్ అలరించనుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఊహించిన దానికంటే ఎక్కువ వేగంగానే షూటింగు జరుపుకుంటోంది. ఈ సినిమాను హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంనేందుకు ఒక మసాలా సాంగ్ ఉందట.అయితే ఈ పాట కోసం కత్రినాను సంప్రదించారట.. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని సమాచారం. ఇందుకోసం ఆమెకి భారీ మొత్తమే ముట్టనుందని అంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సివుంది. కాగా, ప్రస్తుతం ప్రభాస్‌ నటించిన పాన్ ఇండియా సినిమా ‘రాధే శ్యామ్’ విడుదలకు సిద్దంగా ఉంది.

- Advertisement -