హీరోయిన్ రష్మిక మందన్నా డీప్‌ఫేక్ ఫొటో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ డీప్‌ఫేక్ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. అసలు ఈ డీప్‌ఫేక్ గోల ఏమిటి ?, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే ట్రెండ్. అయినా.. ఇదేదో ఉన్నట్టు ఉండి సడెన్ గా ఊడిపడలేదు. ఎప్పటి నుంచో ఉన్నదే. ప్రస్తుతం కత్రినా కైఫ్ నటించిన టైగర్-3 ట్రైలర్ రిలీజ్ కాగా, అందులో కత్రినా టవల్‌తో కనిపిస్తారు. ఆ సన్నివేశం నుంచి ఫొటో తీసుకొని దుండగులు AIని ఉపయోగించి మార్ఫ్‌డ్ ఫొటో సృష్టించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
మొత్తానికి డీప్ ఫేక్ ఫొటో కారణంగా మొన్న రష్మిక, ఇప్పుడు కత్రినా బాధ పడుతున్నారు. కానీ నిజానికి కొన్ని వేల మంది ఆడవాళ్లు నిత్యం ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. రష్మిక మందన్నా మార్ఫింగ్ వీడియో వైరల్ అయింది అనగానే స్పందించిన అధికారులు, సామాన్య ఆడవాళ్ల విషయంలో మాత్రం చూసి చూడనట్టు ఉండటం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా బాధితులకు రక్షణ కల్పించడానికి చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఇలాంటి వాటి విషయంలో కొత్త చట్టాలు రావాలి. భవిష్యత్తులో రాబోయే మార్పులను గుర్తు చేసుకుంటే సగటు మనుషులు భయపడుతున్నారు,
టెక్నాలజీని దుర్వినియోగం చేయడం చూస్తే కచ్చితంగా నిరుత్సాహం కలుగుతుంది. ఇదిలా ఉంటే.. తన వీడియోను ఉపయోగించుకుని రష్మిక డీప్ ఫేక్ వీడియోను సృష్టించారని సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జరా పటేల్ తెలిపారు. ‘నా శరీరానికి రష్మిక ఫేస్ పెట్టి ఆ వీడియోను మార్ఫింగ్ చేశారు. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని ఆమె సూక్తులు చెబుతుంది. ముందు ఈమె ఇలాంటి వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేయకుండా ఉంటే అందరికి మంచిది.
Also Read:నడుంనొప్పితో బాధపడుతున్నారా?