ఆ తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తా: కత్రీనా

190
- Advertisement -

సాధారణ ప్రజలైనా, సెలెబ్రిటీలైనా తప్పులు చెయ్యడం చాలా కామన్‌. ఒక్కోసారి తప్పు చేసినప్పుడు కొంతమంది దాన్ని సరిదిద్దుకోడానికి ట్రై చేస్తుంటారు. లేదా అదే తప్పుని మళ్ళీ రిపీట్‌ అవకుండా జాగ్రత్తపడుతుంటారు.

కానీ..ఇదే ప్రాసెస్‌ ని కొత్తగా చెప్పుకొస్తోంది బాలీవుడ్‌ బ్యూటీ కత్రీనా కైఫ్‌. తాను చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తానంటోంది. ఈ మాటలను కత్రినా తన పేస్‌బుక్ ద్వారా పంచుకుంది.

Katrina Kaif Doesn't Make The Same Mistake Twice

ఎప్పుడూ సోషల్‌మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ అమ్మడు ఈసారి మాత్రం రూటు మార్చి కాస్త డిఫరెంట్‌గా మాట్లాడుతోంది. ‘ఒక తప్పును నేనెప్పుడూ రెండు సార్లు చేయను.. ఓ ఐదారుసార్లు చేస్తా.. అలా చేస్తేనే కదా అది నిజంగా తప్పేనా కాదా.. అనే విషయం తెలిసేది’ అంటూ పోస్ట్ పెట్టేసింది. ఇక ఆ పోస్ట్‌ కాస్తా… సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

కత్రినా పెట్టిన పోస్ట్‌పై ఫ్యాన్స్‌ తెగ కామెంట్స్‌ పెడుతున్నారు. అంతేకాకుండా కత్రీనాను వెనకేసుకొస్తూ…తన పోస్ట్‌ని కూడా తెగ షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే..కత్రీనా ప్రస్తుతం ‘టైగర్ జిందా హై’ మూవీలో నటిస్తోంది.

అయితే సల్మాన్‌ ఖాన్‌తో లవ్‌ ఎఫైర్‌ నడిపించిన కత్రీనా..సల్లూతో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన విషయం తెలిసిందే. ఇక సల్మాన్‌ సైడ్‌ అవగానే..రణ్‌బీర్‌ సింగ్ తో కూడా తెగ తిరిగేస్తోన్న ఈ అమ్మడు ఇప్పటివరకూ ఎన్నితప్పుడు చేసిందో తెలీదుగానీ..చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తానంటూ కొత్త పలుకులు పలుకుతోంది.

- Advertisement -