Katrina:నేను గర్భవతి కాదండీ బాబు

50
- Advertisement -

బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పెళ్లి పై ఇప్పటికే ఎన్నో పుకార్లు వైరల్ అయ్యారు. ఇందులో కత్రినా – విక్కీ కౌశల్ విడాకులు తీసుకుంటున్నారు అని కూడా ప్రచారం చేశారు. ఐతే, కొద్దికాలంగా కత్రినా కైఫ్ గర్భవతి అంటూ ఇటీవల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ అవి అబద్దాలే. మరోవైపు, తన లైఫ్ ని ఫుల్లుగా ఎంజాయి చేస్తున్నట్లు కత్రినా చెప్తోంది.

Also Read:Supreme Court:శివసేన వ్యవహారంపై కీలక తీర్పు

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” అని, తన జీవితం ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉందని, విక్కీ కౌశల్ తనను ప్రాణంగా చూసుకుంటున్నాడు అని కత్రినా చెప్పుకొచ్చింది. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. డిసెంబర్ లో రెండో వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటారు. అందుకే ఇక పిల్లల గురించి పుకార్లు వస్తున్నాయి. పైగా, కత్రినా కైఫ్ ఆ మధ్య పెట్టిన ఒక ఫొటోలో పొట్ట కనిపించడంతో ప్రెగ్నన్సీ బంప్ అనుకున్నారు అంతా.

Also read:అమెరికాకు ప్రధాని మోడీ..

వాటికి చెక్ పెట్టేందుకే కత్రినా కైఫ్ ఆ తర్వాత వేరే ఫోటోలు పెట్టి క్లారిటీ ఇచ్చింది. మొత్తమ్మీద తాను ఇంకా పిల్లలను కనడానికి రెడీగా లేను అంటూ కత్రినా ఇన్ డైరెక్ట్ గా మెసేజ్ లు పాస్ చేస్తోంది. మరోవైపు కండల వీరుడు, తన మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ తో ఇప్పటికీ కత్రీనా కి మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ మధ్య అర్ధరాత్రి ఒంటరిగా కత్రీనా, సల్మాన్ ఖాన్ ఇంటికి వెళ్తూ కనిపించింది. ఆమెకు సల్మాన్ ఖాన్ అంటే నేటికీ ఇష్టమే అని అంటుంటారు. మరి మధ్యలో విక్కీ కౌశల్ రియాక్షన్ ఎలా ఉందో చూడాలి.

- Advertisement -