- Advertisement -
తన పెళ్లిపై వస్తున్న పుకార్లపై ఘాటుగా స్పందించారు నటి కత్రినా కైఫ్. తాను ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు అవుతుంది.. ఈ 15 ఏళ్ల నుంచి నా పెళ్లి గురించి ఏదొక వార్త వస్తూనే ఉంది. ఒక్కో వ్యక్తితో ఒక్కో నెల.. నెలకు ఎన్ని పెళ్లిళ్లు చేస్తారు అని ఫైర్ అయింది. విక్కీ, నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు… ప్రస్తుతానికి అలాంటి ప్లాన్స్ ఏమి లేవని స్పష్టం చేసింది.
పొడుగు కాళ్ల సుందరిగా బాలీవుడ్‌లో తనదైన ముద్రవేసింది కత్రినా. కొద్ది రోజులుగా బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్, ఆమె ప్రియుడు విక్కీ కౌశల్ త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కానున్నారని, రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సస్ ఫోర్ట్ బర్వారాలో వీరి వివాహ వేడుకను ఘనంగా నిర్వహించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తనదైన శైలీలో స్పందించారు కత్రినా.
- Advertisement -