సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేయడం, ఎఫైర్ పెట్టుకోవడం మాత్రమే కాదు.. అతనితో కలిసి సినిమా చేయడం కూడా పులి మీద స్వారీ చేయడం లాంటిదే. అయితే.. ఈ కండలవీరుడితో డేటింగ్ చేయడం, ఎఫైర్ నడపడంతోపాటు కలిసి సినిమాలు చేసిన అనుభవం కూడా ఉన్న కత్రినా కైఫ్ తాజాగా మరోసారి ఈ పులిస్వారి చేస్తోంది. చాలా చిత్రంగా ఆ సినిమా పేరు ‘టైగర్ జిందా హై’ (పులి ఇంకా బతికే ఉంది) కావడం గమనార్హం.
యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బడ్జెట్.. సల్మాన్ ఖాన్ పారితోషికం కలపకుండా 140 కోట్లని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్.. ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యధికంగా చూసిన టీజర్ అనే ఘనత సొంతం చేసుకొంది. ఇంతకుముందు ఈ రికార్డ్ ‘స్టార్ వార్స్’ కు ఉండేదట. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్-కత్రినా ఖాన్ జంట చూడ ముచ్చటగా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. అన్నట్లు.. సల్మాన్ ఖాన్ అంటే కత్రినాకు లవర్ మాత్రమే కాదు.. గాడ్ ఫాదర్ కూడా.
సల్మాన్ ఆశీస్సులతోనే కత్రినా బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ కాగలిగింది. అందుకే పులి స్వారిని ఆమె ఎంతో ఇష్టంగా చేస్తోంది. మన తెలుగు ప్రేక్షకులంతా టీవీల్లో మళ్ళీ మళ్ళీ చూస్తున్న ‘మల్లీశ్వర చిత్రంలో నటించిన కత్రినా.. ఆ తర్వాత ‘అల్లరి పిడుగు’ అనే కళాఖండంలోనూ తెలుగులో నటించింది. బాలకృష్ణ నటించిన ఈ సినిమా ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.