నిర్మాత కాట్రగడ్డ మురారి కన్నుమూత..

140
- Advertisement -

టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. నిర్మాత కాట్రగడ్డ మురారి కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన వయస్సు 78. 1944 జూన్‌ 14న విజయవాడ మొగ‌ల్రాజ‌పురంలో కాట్ర‌గ‌డ్డ భ‌వానీశంక‌ర‌రావు, అన‌సూయ‌మ్మ దంప‌తుల‌కు మురారి జ‌న్మించారు. సినిమాలపై ఉన్న ఆసక్తితో డాక్టర్ చదువును మధ్యలోనే ఆపేసి చెన్నైకి వెళ్లారు.

కాట్రగడ్డ మురారి యువ చిత్ర ఆర్ట్స్ పేరుతో సినిమాలు నిర్మించారు. నారి నారి నడుమ మురారి, త్రిశూలం, జానకి రాముడు, శ్రీనివాస కల్యాణం, సీతా మహాలక్ష్మి, గోరింటాకు సహా పలు చిత్రాలు తెలుగులో నిర్మించారు. 90వ దశకం వరకు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన కాట్రగడ్డ మురారి 2012లో ‘నవ్విపోదురు గాక’ పేరుతో ఆత్మకథ రాశారు.

- Advertisement -