శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి కత్తిమహేష్ నగర బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే. గత ఏడాది ఓ హిందూ సమావేశంలో పాల్గొని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న కారణంతో స్వామి పరిపూర్ణానందను సైతం నగర బహిష్కరణ చేశారు. ఈ నేపథ్యంలో స్వామి పరిపూర్ణానందకు కత్తి మహేష్ మద్దతుగా నిలిచారు. స్వామిని నగర బహిష్కరణ విధించడాన్ని తాను ఖండిస్తున్నానని చెప్పాడు.
వ్యక్తుల బహిష్కరణలతో సమస్యలు పరిష్కారం కావు, బహిష్కరణ ఆధునిక ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దం అని పేర్కొన్నాడు. మనుషులను తప్పిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయనేవి ఆటవిరక దోరణి అన్నారు. ఆ దిశగా ప్రభుత్వాలు పయనిస్తే అది తిరోగమనమే అవుతుంది అని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశాడు.
మరోవైపు స్వామి పరిపూర్ణానందను నగర బహిష్కరణ విధించిన పోలీసులు, ఆయనను ఎక్కడికి తీసుకువెళ్లారో మాత్రం చెప్పలేదు. స్వామి నగర బహిష్కరణపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై స్పందించిన స్వామి, తన గురించి అనుచరులు ఆందోళన చెందవద్దంటూ చెప్పారు. ధర్మాన్ని న్యాయం నిలబెడుతుందనే నమ్మకం తనకు ఉందని తెలిపారు.
https://www.facebook.com/mahesh.kathi/posts/10156591628351115