పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి నిప్పులు చెరిగారు సినిమా క్రిటిక్ కత్తి మహేష్. ఓ ఛానల్‌లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మాట్లాడిన కత్తి…పవన్ ఓ పొలిటికల్ జోకర్ అంటూ తీవ్ర స్ధాయిలో విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ కాపు కులం పిచ్చితో కొట్టుకుంటున్నాడని మండిపడ్డారు .అంతేగాదు పవర్ బ్రోకర్ అంటూ ఎద్దేవా చేశాడు.
జనసేన అధికార ప్రతినిధి కల్యాణ్ దిలీప్ సుంకరకు తెలిసినంత కూడా పవన్ కల్యాణ్ కు తెలియదని…జనసేన దళితులకు వ్యతిరేకంగా ఉన్న ఒక కులం పార్టీ అని ఆరోపించారు. కుల అహంకారాన్ని నరనరాన జీర్ణించుకున్న పార్టీ జనసేన అని విమర్శల పర్వం కొనసాగించారు.
కొంతకాలంగా పవన్ ఫ్యాన్స్‌కి కత్తి మహేష్‌కి మధ్య వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్‌పై వరుస కామెంట్లతో మహేష్ కత్తి దూస్తుండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కత్తి మహేష్ ఎన్ని కామెంట్లు,విమర్శలు చేసిన పవన్ మాత్రం అసలు పట్టించుకోకపోవడం విశేషం.