ఇటీవల పవన్ కల్యాణ్ అభిమానులకు, క్రిటిక్ కత్తి మహేష్‌కు మధ్య జరిగిన వివాదం ఏమిటో అందరికీ తెలిసిందే. పవన్ కల్యాణ్‌ని టార్గెట్ చేస్తూ కత్తి మహేష్ గత కొన్ని నెలలుగా ఈ పేరు తెలుగు టీవీ ఛానెల్ చర్చల్లో మారుమ్రోగింది. ప్రస్తుతం ఈ ఇయన పేరు తెలియను వరంటూ ఏవరూ లేరంటే దీంట్లో అతిశయోక్తి లేదు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మీద ట్వీట్స్ తో విరుచుకుపడుతూ వీరంగం సృష్టించాడం దానికి సమధానంగా పవన్ ఫ్యాన్స్ ఫోన్లు చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. తదనంతరం ఫ్యాన్స్ కు, కత్తి మహేష్ మధ్య చర్చలు కూడా జరిగాయి. దాంతో ఆ ఎపిసోడ్ కు పుల్ స్టాప్ పెట్టేశాడు కత్తి మహేష్.
తాజాగా అలాంటి ట్వీట్లకు మళ్లీ పని చెప్పారు కత్తి మహేష్. మహేష్ బాబు హరోగా కొరటాల శివ దర్శకత్వంలోవస్తున్న తాజా చిత్రం ‘భరత్ అనే నేను’ఈ సినిమాకు సంబంధించి బహిరంగ సభను ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ఈ సభలో మహేష్ బాబు ఫ్యాన్స్ ను ఉద్దేశించి కత్తి మహేష్ ట్వీట్ చేస్తూ మహేష్ అభిమానులు ఆగ్రహానికి గువుతున్నారంటూ ట్వీట్ చేసి మళ్లీ సంచలనంగా మారాడు.
దీనికి ధీటుగా మహేష్ బాబు ఫ్యాన్స్ సమాధానమిస్తూ‘‘పవన్ కల్యాణ్ పాలిటిక్స్‌కి వెళ్లారు కాబట్టి నిన్ను వదిలేశారు. మేం అలా కాదు.. మా వెనుక ఎలాంటివి లేవు. అంతు చూస్తాం’’ అంటూ.. కత్తి చేసిన ట్వీట్‌కి మహేష్ బాబు అభిమానులు రిప్లైలు ఇచ్చారు. ఇదంతా చూస్తుంటే గత ఎపిసోడ్ మళ్లీ తెరమీదకు వచ్చేట్లు కనిపిస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో .