చెర్రీ సరసన కేథరిన్..

270
Catherine Tresa Latest Photoshoot Photos
- Advertisement -

రామ్ చరణ్‌ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్నవిషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ‘రంగస్థలం’ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు చరణ్‌. ఈ సినిమా తర్వాత గ్యాప్ లేకుండా సినిమాల మీద సినిమాలు చేసేపనిలో పడ్డాడు.

Katherine Chance to ram charan boyapati movie

బోయపాటితో చేయబోయే ఈ సినిమాలో హీరోయిన్‌గా కైరా అద్వాని ఎంపిక కాగా కేథరిన్ థ్రేసాను ఓ ప్రత్యేకమైన పాత్ర కోసం తీసుకున్నారట బోయపాటి. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ డ్యాన్స్ కోసం కేథరిన్ న్యూయార్క్‌లో పాపులరైన డాన్సర్ మిస్ వి దగ్గర ‘పాపింగ్ అండ్ లాకింగ్ స్ట్రీట్ స్టైల్ డాన్స్’ లో శిక్షణ కూడా తీసుకుంటోందట.

గతంలో బోయపాటి చిత్రాలైన ‘సరైనోడు’లో నటించి ‘జయజానకి నాయక’లో స్పెషల్ సాంగ్ చేసింది. గతంలో బోయపాటి సినిమాల్లో నటించడంతో ఏరి కోరి మారీ ఆ పాత్ర కోసం కేథరిన్‌ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 12 నుంచి బ్యాంకాక్ షెడ్యూల్‌లో ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఈ షెడ్యూల్ అనంతరం జరగబోయే షూటింగ్‌లో కేథరిన్‌ పాల్గొననున్నట్లు సమాచారం. డి.వి.వి.దానయ్య బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో కేథరిన్‌తో పాటు ప్రశాంత్, స్నేహ, వివేక్ ఒబెరాయ్, శ్రీకాంత్, ఆర్యన్ రాజేశ్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.

- Advertisement -