ప్రేమ నాదే…పగ నాదే

264
Kathalo Rajakumari Teaser
- Advertisement -

విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకునే నారా రోహిత్ మరోసారి సరికొత్త ప్రేమ కథతో తెరకెక్కిస్తున్న చిత్రం ‘కథలో రాజకుమారి’. ప్రేమ, పగ అనే రెండు అంశాల చుట్టూ అల్లుకున్న విభిన్న ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మహేష్ సూరపనేని  దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నాగశౌర్య  ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం వచ్చిన ఈ సినిమా ఫస్టు లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను వదిలారు. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు.

“ప్రేమ .. పగ .. మిగిలిన ఎమోషన్స్ లా వీటిని అందరితో పంచుకోలేం, ప్రేమ నాదే .. పగ నాదే”. అంటూ నారా రోహిత్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది .. ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చి పెడుతుందనే నమ్మకంతో నారా రోహిత్ వున్నాడు. ఈ టీజర్ ను చూస్తుంటే, ఆయన నిరీక్షణ ఫలిస్తుందనే అనిపిస్తోంది. రోహిత్ సరసన మలయాళ నటి నమిత ప్రమోద్ నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

- Advertisement -