కాటమరాయుడు కష్టాలకు పవనే కారణమట..!

211
Katamarayudu teaser launch
- Advertisement -

కాటమరాయుడు మూవీ షూటింగ్ ఇప్పటికీ సజావుగా జరగడం లేదట. దీనికి కారణం పవన్ కల్యాణేనని తెలుస్తోంది. షూటింగ్ లేటుకు, పవన్ కు మధ్య సంబంధం ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఇటీవల పవన్ రాజకీయాల్లోనూ బిజీ అయ్యారు. దీంతో తన మూడ్ ను చూసుకుని సినిమా షూటింగ్ కు వస్తున్నాడట.
Katamarayudu
దీంతో మిగతా ఆర్టిస్టుల డేట్స్‌, టెక్నీషియన్స్‌ షెడ్యూల్స్‌ ఎడ్జెస్ట్ కావడం కష్టంగా మారిందని టాక్. నిజానికి కాటమరాయుడు షూటింగ్‌ ఈపాటికే పూర్తి కావాల్సి ఉందట. ఒకటి, రెండు పాటల మినహా జనవరి నెలాఖరుకి సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని చిత్ర యూనిట్ భావించింది. కానీ, పవన్‌ రాజకీయాల్లో బిజీ కావడంతో కాటమరాయుడు మూవీకి కష్టాలు మొదలయ్యాయి.

Katamarayudu

ఈ ఆలస్యం వల్ల బిజినెస్ ఎక్కడ దెబ్బతింటుందోనని నిర్మాత శరత్ మరార్ టెన్షన్ పడుతున్నాడని సమాచారం. అయితే ఇప్పటి వరకు కాటమరాయుడు బిజినెస్ కు ఎలాంటి ఢోకాలేదని తెలుస్తోంది.

- Advertisement -