పవన్‌ను వాడేసుకుంటున్న చిరంజీవి..

190
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవికి,,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ మధ్య రాజకీయాల పరంగా భేదాభిప్రాయాలు ఉన్నా,,బయట మాత్రం ఇద్దరం ఒక్కటే అని మరోసారి నిరూపించారు. ముఖ్యంగా సినిమాలకు వచ్చేసరికి మాత్రం ఒకరికి ఒకరు సహకరించుకుంటూ,,మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటేనని తెలియజేశారు. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌ హీరోగా నటిస్తున్న కాట‌మ‌రాయుడు మూవీ సెట్‌లో,,మెగాస్టార్ చిరంజీవి దర్శనమిచ్చాడు. కాటమరాయుడుకు,,మెగాస్టార్‌కు లింక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా.. అసలు విషయం ఏంటంటే. కాటమరాయుడు షూటింగ్ కోసం ముస్తాబుచేసిన స్పెషల్‌ సెట్‌ను,,మెగాస్టార్ తన 150 వ సినిమా కోసం వాడుకున్నాడట.

online news portal

చిరంజీవి నటిస్తున్న ఖైదీ నెంబర్ 150 సినిమా కోసం ఓ పెద్ద వేయాల్సి వచ్చిందట. ఖైదీ నెంబర్ 150 సినిమాను సంక్రాంతి బరిలో నిలిపేందుకు ప్లాన్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే రిలీజ్ డేట్‌కు టైం త‌క్కువ‌గా ఉండ‌డంతో ఇప్పటికిప్పుడు ఓ సెట్ వేయాలంటే మ‌ళ్లీ కొంత స‌మ‌యం ప‌డుతుంది కాబ‌ట్టి, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ సలహాతో కాటమరాయుడు సెట్ లో షూటింగ్ చేశార‌ని తెలిసింది. రెండు మూడు రోజుల పాటు ఇదే సెట్‌లో షూటింగ్ చేస్తార‌ని చిత్ర బృందం స్ప‌ష్టం చేసింది. ఇలా పవన్ అన్న చిరంజీవి పై ఉన్న ప్రేమను చాటుకున్నాడు. అయితే ఖైదీ నెంబర్‌ 150 లో హీరోయిన్‌గా నటిస్తున్న కాజల్‌, కామెడీయన్ ఆలీనిని తీసుకోవడం వెనుక ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉన్నాడ‌ని వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. వినాయక్ దర్శకత్వం అందిస్తున్న ఈసినిమాను కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నాడు. నిర్మాత రామ్ చరణ్ కు కాస్త బడ్జెట్ కూడా ఆదా అయినట్టైంది.

- Advertisement -