పవన్ ఫ్లాప్‌ మూవీ బాలీవుడ్‌లోకి రీమేక్‌..!

498
akshay kumar bachchan pandey
- Advertisement -

టాలీవుడ్‌ సినిమాలు బాలీవుడ్‌లో రిమేక్‌ కావడం కొత్తేమీ కాదు. అయితే టాలీవుడ్‌లో హిట్‌ అయిన సినిమాలు బాలీవుడ్‌లో కూడా సంచలనం సృష్టించాయి. కానీ తాజాగా ఇందుకు భిన్నంగా ఫ్లాప్ సినిమాను బాలీవుడ్‌లో రిమేక్ చేయబోతున్నారు. ఇంతకీ ఆ మూవీ ఏంటనుకుంటున్నారా…అదే పవర్ స్టార్ పవన్ నటించిన కాటమరాయుడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోళ్తా కొట్టింది.

ఈ సినిమాను హిందీలో ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కథను మార్చి బచ్చన్ పాండేగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్ ఆసక్తి పుట్టిస్తుంది. నుదిటిపై విబూది.. మెడలో గోల్డ్ చైన్.. మోకాళ్ళ పై వరకు నల్లని పంచె కట్టుకొని ఉన్న అక్షయ్ కుమార్‌ను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Image result for pawan katamarayudu remake akshay

ఫర్హాద్ సామ్జి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సాజిద్ నడియావాలా నిర్మిస్తున్నాడు. 2020 క్రిస్మస్‌కు ఈ సినిమాను విడుదల చేస్తామని చెప్పారు. ఇక ప్రస్తుతం అక్షయ్ కుమార్ హౌస్ ఫుల్ 4, సూర్యవంశీ, లక్ష్మీ బాంబ్, గుడ్ న్యూస్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.

- Advertisement -