పవన్కు చెల్లిగా ఆనంది…

229
Katamarayudu Pawan kalyan
- Advertisement -

కాటమరాయుడు సినిమా షూటింగ్లో పుల్‌ బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను తరువాత చేయబోయే సినిమాలను కూడా వరసగా లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే తమిళ దర్శకుడు నేసన్ దర్శకత్వంలో ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్న సినిమాతో పాటు రాధకృష్ణ నిర్మాణంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించాడు. ఈ రెండు సినిమాలకు సంబందించిన నటీనటులు ఎంపిక కూడా శరవేగంగా జరుగుతోంది.

 Katamarayudu Pawan kalyan

ముఖ్యంగా నేసన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా తమిళ సూపర్ హిట్ సినిమా వేదలం కు రీమేక్ అన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఎంతో కీలకమైన చెల్లెలి పాత్రకు ఓ తెలుగమ్మాయినే ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన బస్ స్టాప్ సినిమాతో పరిచయం అయిన ఆనంది, తరువాత తమిళ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇప్పుడు ఈ అమ్మాయినే పవన్కు చెల్లిగా ఫైనల్ చేశారట. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన ఇతర నటీనటుల వివరాలతో పాటు సినిమా ఎప్పుడు మొదలుకానుందో తెలిసే అవకాశం ఉంది.

 Katamarayudu Pawan kalyan

కాటమరాయుడు సినిమా మార్చి 29, 2017న ఉగాది పండుగను రోజున విడుదల కానున్న విషయం మనకు తెలిసిందే.

 Katamarayudu Pawan kalyan

- Advertisement -