పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడుడెప్పుడ అని ఎదురుచూస్తున్న కాటమరాయుడు టీజర్ వచ్చేసింది. ఈ సినిమా టీజర్ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఇన్ని రోజులు వరకు వెయ్యికళ్లతో ఎదురుచూసారు. ఇప్పటివరకు ఫస్ట్‌లుక్, ఫెస్టివల్ లుక్‌లను మాత్రమే విడుదల చేసిన చిత్రం బృందం తాజాగా ‘కాటమరాయుడు’ టీజర్‌ను విడుదల చేసింది. ‘ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు.. ఎవడున్నాడన్నదే ముఖ్యం’ అని యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్‌లో పవన్ చెప్పే డైలాగ్ విపరితంగా ఆకట్టుకుంటోంది.
నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శరత్ మరార్ నిర్మాణంలో కిశోర్ కుమార్ (డాలీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కాటమ రాయుడు’. సర్దార్ గబ్బర్ సింగ్ తరువాత పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. పవన్ సరసన శృతి హాసన్ నటిస్తొంది…. గతంలో శృతి , పవర్‌స్టార్ వీరిద్దరు నటించిన గబ్బర్‌సింగ్ సినిమాలో వీరి కెమిస్టీ బాగానే వర్కంట్ అయ్యింది. ప్రస్తుతం కాటమ రాయుడు సినిమా శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటుండగా అనుకున్న తేదీ కన్నా ముందే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు అవకాశం ఉన్నట్టు తెలిసింది.