పవర్‌ స్టార్‌కు పవర్‌ఫుల్‌ సర్‌ప్రైజ్‌..!

197
Katamarayudu Gets A Powerful Surprise
- Advertisement -

సినీ నటుడు పవన్‌కల్యాణ్‌కి నటుడు శివబాలాజీ పవర్‌ఫుల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. పవన్‌ వీరాభిమాని అయిన శివబాలాజీ తన అభిమానాన్ని చాటుకునేందుకు పవన్‌ ఆశ్చర్యపోయేలా ఓ ఖడ్గాన్ని బహుమతిగా ఇచ్చారు. అదీ సాదాసీదాది కాదు. ఖడ్గంపై పవన్‌ ఫొటోతో పాటు జనసేన లోగోను డిజైన్‌ చేయించారు.  ప్రస్తుతం పవన్‌ ‘కాటమరాయుడు’ షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.‘కాటమరాయుడు’ సెట్స్‌కి వెళ్లి మరీ సగౌరవంగా దానిని అందజేశారు. దీని గురించి శివబాలాజీ తన ఫేస్‌బుక్‌లో వెల్లడిస్తూ..‘ఆయనతో ఎంత సేపు ఉంటే అంతగా నేను ఆయన్ని అభిమానిస్తున్నట్లు. ఆయనంటే నాకు ఎంత అభిమానమో చూపించాలనుకున్నాను అని చెప్పారు.
 Katamarayudu Gets A Powerful Surprise
ఆయనపై అభిమానం నన్నెప్పుడు ఆతృతగా ఫీలయ్యేలా చేయలేదు. నాకు మాటలు రావు. ఏం చెప్పాలనుకుంటున్నానో సరిగ్గా చెప్పలేను. నాలో తెలియని ఎమోషన్స్‌ కారణంగా తల బాదుకుంటున్నాను. ఇలా ఆలోచిస్తుండగా ఓ ఉపాయం తట్టింది. ప్రజల వీరుడైన పవన్‌కి ఖడ్గం బహూకరించాలనుకున్నాను. కానీ ఎలా? నా మనసులో ఆయన గురించి ఏమనుకుంటున్నానో ఖడ్గంపై ఎలా చూపించగలను. ఇందుకోసం వెతకడంప్రారంభించాను.

డెహ్రాడూన్‌లో నాకు తెలిసిన ఖడ్గ తయారీదారుడిని కలిశాను. దానిపై ఎలాంటి డిజైన్‌ వేయించాలో అన్నీ ఆ డిజైనర్‌కి వివరించాను. రోజూ నాకు, నా భార్య మధుమితకు ఎన్నో ఆలోచనలు వచ్చేవి. ఒకసారి ఖడ్గం డిజైన్‌ పూర్తయ్యాక ఏం రాయించాలన్న ఆలోచన మొదలైంది. దానిపై పవర్‌ఫుల్‌ పదాలుండేలా పవన్‌గారి ఫొటోకింద ‘జనసేన’ అని రాయించాలనుకున్నాను. ఇలా నేను చెప్పుకొంటూ పోతుండడంతో డిజైనర్‌కి విసుగుపుట్టి సర్‌.. ఇది అవ్వదు అనేశాడు. అయినా నేను వూరుకోలేదు. చెప్పినట్లే డిజైన్‌ చేసి ఇవ్వాలన్నాను. ఇందుకోసం నా స్నేహితుడు మోహన్‌ సాయం తీసుకోమన్నాను. అలా నాకుకావాల్సింది తయారు చేయించుకున్నాను. ఆ ఖడ్గాన్ని పవన్‌ సర్‌కి ఇచ్చినప్పుడు ఆయన రియాక్షన్‌ నేను మర్చిపోలేను.’ అని పవన్‌పై తనకున్న అభిమానాన్ని ఫ్యాన్స్‌తో పంచుకున్నారు శివబాలాజీ.

- Advertisement -