సీఎం కేసీఆర్‌ని కలిసిన కాసర్ల

316
- Advertisement -

టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షులు కాసర్ల నాగేందర్ రెడ్డి….క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ని కలిశారు. ఎన్నారై టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వచ్చిన కాసర్ల…కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ ఆస్ట్రేలియా పార్టీ ద్వారా చేయబోతున్న కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌…కాసర్ల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా మొత్త్తం గులాబీ మాయం చేయాలన్న ఆకాంక్షని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కవితకు కాసర్ల ధన్యవాదాలు తెలిపారు.

ఇటీవలె కోఅలీషన్ ఆఫ్ ఓవర్సీస్ తెలంగాణ అసోసియేషన్స్ (కోట) మరియు ప్రవాసీ మిత్ర సంయుక్త ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అందజేసే ‘ప్రవాసీ ఎక్సలెన్స్’ అవార్డుకు టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షులు కాసర్ల నాగేందర్ రెడ్డి ఎన్నికైన సంగతి తెలిసిందే.ఈ నెల 18న శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన ఇంటర్నేషనల్ మైగ్రంట్స్ డే సందర్బంగా ఆయనకు ఈ అవార్డును అందజేశారు.

Kasarla Nagender reddy meets CM KCR

కరీంనగర్ జిల్లా చెందిన నాగేందర్ రెడ్డి కాసర్ల…. గత 13 సంవత్సరాలుగా ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఎన్నారైలకు చేరవేయటంలో ముందున్నారు. దీంతో పాటు మెల్ బోర్న్ నగరంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

- Advertisement -