విప్లవయోధుడు…కళైంజ్ఞర్‌

203
karuna dead

ద్రవిడ కురువృద్దుడు,మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతితో తమిళ తంబీలు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ అభిమాన నేత ఇకలేరన్న వార్తను జీర్ణించుకోలేక పోతున్నారు. సినీ,రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కరుణ మృతి పట్ల తీవ్ర విషాదాన్ని వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు.

కరుణ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు సూపర్ స్టార్ కరుణానిధి.నా కళైంజ్ఞర్‌ను కోల్పోయాను…. నా జీవితంలో ఇది బ్లాక్ డే. ..ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నానని అన్నారు.

ఆరు దశాబ్దాలకుపైగా తమిళ ప్రజల ఆరాధ్య నాయకుడిగా, కళైంజ్ఞర్‌గా తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని రాహుల్‌గాంధీ అన్నారు. భారతదేశం గొప్ప పుత్రుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

 karunanidhi

కరుణానిధి లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. గొప్ప నాయకుడు, రచయిత, స్క్రీన్ రైటర్, విప్లవయోధుడు, ప్రసంగీకుడిని కోల్పోయామని మలయాళ నటుడు మమ్ముట్టి అన్నారు. భారతదేశం గొప్ప జ్ఞానం కలిగిన నాయకుడిని కోల్పోయిందని నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ తెలిపారు.

కరుణానిధి భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం రాజాజీ హాల్‌కు తరలించారు. పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, వేలాదిమంది ప్రజలు కరుణానిధి పార్థీవదేహాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. కరుణ పార్థీవదేహన్ని జాతీయ జెండాతో కప్పిఉంచారు. కేంద్రం నేడు జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. మెరినా బీచ్‌లోని అన్నాదురై సమాధి దగ్గర ఖననం చేయాలని తమిళనాడు సీఎం పళనిస్వామిని కోరారు స్టాలిన్‌. అయితే న్యాయపరమైన చిక్కులు తలెత్తె అవకాశం ఉందని అక్కడ అంత్యక్రియలకు అనుమతివ్వలేదు. మరికాసేపట్లో కరుణానిధి అంత్యక్రియలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.