కార్తికేయ ‘చావు కబురు చల్లగా’ ప్రారంభం..!

485
- Advertisement -

RX 100 సినిమాతో యూత్‌లో తనకంటూ తెచ్చుకున్న హీరో కార్తికేయ. అయితే ఆర్‌ ఎక్స్‌ 100 తర్వాత కార్తికేయ చేసిన చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో వెరైటీ టైటిల్‌, కొత్త గెటప్‌లో తెరముందుకు రాబోతున్నాడు.

Chaavu Kaburu Challaga

తాజాగా అల్లు అరవింద్ సమర్ఫణలో గీతా ఆర్ట్స్ 2 బ్యాన్‌లో కొత్త సినిమాను ప్రారంభించాడు ఈ కుర్ర హీరో. ఈ సినిమాకు ‘చావు కబురు చల్లగా’ అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ సినిమాతో కౌశిక్ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. బన్ని వాస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి అల్లు అరవింద్ మనవడు అయాన్ కెమెరా స్విచ్ఛాన్ చేసాడు. బన్ని వాస్ కూతురు క్లాప్ కొట్టింది.

Hero Kartikeya

ఈ సినిమాలో ‘బస్తీ బాలరాజు’ పాత్రలో కార్తికేయ కనిపించనున్నాడు. ఆయన లుక్ కి సంబంధించిన పోస్టర్ ను కూడా గురువారం విడుదల చేశారు. శవాలను స్మశానానికి తీసుకెళ్లే వాహనంపై నుంచుని దమ్ముకొడుతూ ఆయన కనిపిస్తున్నాడు. గళ్ల షర్టు పైకి మడిచి .. లుంగీ పైకి కట్టి పూర్తి మాస్ లుక్ తో కార్తికేయ కనిపిస్తున్నాడు. ఈ సినిమాకి జాక్స్ బిజోయ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

- Advertisement -