ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న సినిమా “భజే వాయు వేగం”. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 31న “భజే వాయు వేగం” సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ ఉండబోతుంది.
ఫస్ట్ లుక్, టీజర్ కి వచ్చిన అనూహ్య స్పందనని కొనసాగించడానికి ఈ రోజు సినిమా మొదటి పాట ‘సెట్ అయ్యిందే’ ను రిలీజ్ చేశారు. ఈ పాట ప్రోమోకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ రాగా ఫుల్ లిరికల్ సాంగ్ కూడా ఇన్ స్టంట్ చాట్ బస్టర్ అవుతోంది. రధన్ కంపోజ్ చేసిన ఈ మాస్ బీట్ సాంగ్ కు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి ట్రెండీ లిరిక్స్ అందించారు. రంజిత్ గోవింద్ ఎనర్జిటిక్ గా పాడారు. హోళీ సంబరాల నేపథ్యంతో కలర్ ఫుల్ గా ఈ పాటను తెరకెక్కించారు సినిమాటోగ్రాఫర్ ఆర్ డి రాజశేఖర్.
‘సెట్ అయ్యిందే లైఫ్ సెట్ అయ్యిందే నీ వల్లే నా లైఫ్ సెట్టయ్యిందే, సెట్ అయ్యిందే లైఫ్ సెట్ అయ్యిందే, నా లవ్ స్టోరి బ్లాక్ బస్టర్ హిట్టయ్యిందే..‘ అంటూ ప్రియురాలిని ఉద్దేశించి ఓ ప్రేమికుడు వ్యక్తపరిచే సందర్భంలో సాగిందీ పాట. ఈ పాటలో కార్తికేయ, ఐశ్వర్య మీనన్ చేసిన హుక్ స్టెప్ హైలైట్ గా నిలుస్తోంది. విశ్వ రఘు కొరియోగ్రఫీ చేసిన ఈ స్టెప్ రీల్స్ లో ట్రెండ్ అయ్యే కళ కనిపిస్తుంది.
Also Read:Harishrao:కేసీఆర్‌కు ఘనస్వాగతం పలుకుదాం