90 ఎంఎల్‌ రిలీజ్ డేట్ పిక్స్‌..

356
karthikeya

ఆర్‌ఎక్స్100 ఫేమ్‌ కార్తికేయ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ’90 ఎం.ఎల్‌’. శేఖర్‌ రెడ్డి ఎర్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని కార్తికేయ క్రియేటివ్‌ వర్క్ సంస్థ నిర్మిస్తోంది. కార్తీకేయ సరసన నేహా సోలంకి హీరోయిన్‌గా నటిస్తోంది.

టీజర్‌తో సినిమాపై అంచనాలను పెంచేసిన ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. తాజాగా సినిమాకు సంబంధించి తాజా అప్‌డేట్ వచ్చేసింది. డిసెంబర్ 25 క్రిస్మస్ కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ సినిమా వైవిధ్యంగా ఉంటుందని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాలో ఈ పాటలు మంచి హైలైట్‌గా నిలుస్తాయని తెలిపారు. ఆర్‌ఎక్స్ 100 తర్వాత హిప్పీ,గుణ 369 పెద్దగా సక్సెస్‌కాకపోవడంతో ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు కార్తీకేయ. మరీ కార్తికేయ అంచనాలను ఈ సినిమా నిలబెడుతుందా లేదా వేచిచూడాలి.