కార్తీకేయ 2…వసూళ్లెంతో తెలుసా?

71
- Advertisement -

విభిన్నమైన కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు యంగ్ హీరో నిఖిల్ . గతంలో డైరెక్టర్‌ చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. నిఖిల్ కెరిర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవగా రీసెంట్‌గా ఈ సినిమాకు సీక్వెల్ కార్తీకేయ 2తో ప్రేక్షకుల ముందుకువచ్చారు నిఖిల్.

బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. మూడు రోజులు ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.26 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.
కేవలం మూడు రోజుల్లోనే కార్తికేయ 2 చిత్రం చాలా ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్‌కు కూడా చేరుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి.

ఏరియాల వారిగా వసూళ్లను పరిశీలిస్తే…నైజాం – 4.06 కోట్లు,సీడెడ్ – 1.83 కోట్లు,ఉత్తరాంధ్ర – 1.51 కోట్లు,ఈస్ట్ – 0.99 కోట్లు,వెస్ట్ – 0.73 కోట్లు,
గుంటూరు – 1.14 కోట్లు,కృష్ణా – 0.87 కోట్లు,నెల్లూరు – 0.41 కోట్లు,ఏపీ+తెలంగాణ – రూ.11.54 కోట్లు(రూ.17.80 కోట్ల గ్రాస్),కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 0.70 కోట్లు,ఓవర్సీస్ – 2.60 కోట్లు,నార్త్ ఇండియా – 0.60 కోట్లు,టోటల్ వరల్డ్ వైడ్ – రూ.15.44 కోట్లు(రూ.26.50 కోట్ల గ్రాస్) రాబట్టింది.

- Advertisement -