కార్తీక మాసం సందర్బంగా శ్రీశైలం పురవీధులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. పాతాళ గంగలో పుణ్యస్నానం ఆచరించి స్వామి అమ్మవార్లను దర్శించి కార్తీక దీపాలను వెలిగించారు .శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెద్ద ఎత్తున భక్తులకోసం లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్తీక మాసంలో కార్తీక దీపం వెలిగించడం కానీ వెలిగిన దీపాన్ని చూడడం చేసినట్లయితే మానవులకు, పశుపక్ష్యాదులు, జలరాశులు, మొక్కలు, కీటకాలు జంతువులకు పునర్జన్మ ఉండదని పుణ్యంతో కైలాసం చేరుతారని పురాణాలు తెలుపడంతో ఆలయం పుష్కరిణి వద్ద ఉచితంగా దీపారాధన చేసుకొనవచ్చని కార్తీకమాసంలో దీపారాధననే కాకుండా దీప దర్శనం కూడా ఎంతో పుణ్య దాయకం. ఈ కార్తీక మాసంలో ప్రతి సోమవారం పుష్కరిణి వద్ద నాలుగు సోమవారాలుతో పాటు కార్తీక పౌర్ణమి రోజున కూడా లక్ష దీపోత్సవం అలాగే పుష్కరిణికి హారతిలో భాగంగా దశవిధములైన హారతులను స్వామిఅమ్మవార్లకు ఇచ్చారు.
ఈ అపురూప సుందర దృశ్యాన్ని చూసేందుకు కార్తీకదీపాలను పుష్కరిణి వద్ద వెలిగించేందుకు ఆ దీపకాంతుల్లో దేదీప్యమానంగా విరాజిల్లుతున్న స్వామి అమ్మవార్లను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముందుగా స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా ఉత్సవమూర్తులను పుష్కరుని వద్దకు తీసుకొని వచ్చి పూజాదికాలను నిర్వహించి స్వామి అమ్మవార్లకు పుష్కరిణికి దశవిధ హారతులను ఇచ్చారు.ఈ హారతులను దర్శించడం వలన అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు సుఖసంతోషాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.