ధర్మప్రచారంలో భాగంగా నవంబరు 20న తిరుపతి, 27న కర్నూలు, డిసెంబరు 4న వైజాగ్‌లో కార్తీక దీపోత్సవాలు నిర్వహిస్తామని, ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు.
తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో మంగళవారం ఈవో కార్తీక దీపోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దాతల సహకారంతో ఈ మూడు ప్రాంతాల్లో కార్తీక దీపోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం ఆయా జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం సహకారం తీసుకోవాలని సూచించారు.
తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులతో సంప్రదించి దీపోత్సవానికి అవసరమైన సామగ్రిని సిద్ధం చేసుకోవాలన్నారు. ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. దీపోత్సవ కార్యక్రమ సరళిపై సుదీర్ఘంగా చర్చించారు. ఎక్కువ మంది భక్తులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Also Read:Bigg Boss 7 Telugu:ఈసారి నామినేషన్స్‌లో 8 మంది