బుల్లితెర పాపులర్ సీరియల్ కార్తీకదీపం 1082 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. శుక్రవారం ఎపిసోడ్‌లో 25 తేదీ రిజిస్టర్ ఆఫీస్‌లో ముహూర్తం నిర్ణయించుకుని వచ్చారు అంటూ దీప సౌందర్యతో బాధపడుతుంది. బయట క్లినిక్‌లో వైద్యం చేస్తున్న కార్తీక్‌కి మోనిత కొత్త నంబర్‌తో కాల్ చేస్తుంది. మోనిత అని తెలియడంతో ‘ఎందుకు చేశావ్? ఇప్పుడు నేను బిజీ’ అంటాడు కార్తీక్. అయితే మోనిత ఒత్తిడి చేయడంతో ఆమె దగ్గరికి బయలుదేరుతాడు కార్తీక్.
దీంతో కార్తీక్ ఎక్కడికి వెళ్తున్నావ్ అంటూ ఇంట్లో వారు అడగగా పని ఉందని చెప్పగా ఇంకెక్కడికి మోనిత దగ్గరికేనంటూ చెబుతుంది దీప. వారి మాటలు పట్టించుకోని కార్తీక్ అక్కడి నుండి వెళ్లిపోగా అమ్మమ్మా అంటూ పిల్లలు పిలవడంతో.. సంబరంగా రండి రండీ అంటుంది. వాళ్లని ప్రేమగా ముద్దాడుతుంది సౌందర్య.
కార్తీక్…మోనిత ఇంటికి వెళ్లగా కొత్త పెళ్లికొడుకు వచ్చాడు అంటూ మోనిత..ప్రియమణితో చెబుతుంది. ఎంతసేపు ఆ ఇంట్లో ఆవిడ ఎదురుగా మూగప్రేమతో ఉంటావ్ తప్పా పిలిస్తే రావుగా.. అందుకే చిన్న అబద్ధం చెప్పాను..అలా అంటే వెంటనే వచ్చేస్తావని అలా చెప్పాను.. అంటుంది మోనిత నవ్వుతూ. నేను నీకు అంత ఖాళీగా కనిపిస్తున్నానా? నేను వెళ్తాను అని ఆవేశంగా చెబుతాడు కార్తీక్.
నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటే.. అప్పుడు పరిస్థితులు వేరు.. నీ మీద ప్రేమతోనో ఇష్టంతోనో కాదు.. ఉక్రోషంతో.. దీపకు ఏ అవకాశం ఇవ్వకుండా నిన్ను అడ్డం పెట్టుకున్నాను.. అని కార్తీక్ తెలపగా… గతం గురించి మాట్లాడుకుని ఉపయోగం లేదు.. నాకు పెళ్లి గురించి కంగారు పెరిగిపోతుందని మాటమార్చేస్తుంది మోనిత. ఈ క్రమంలో మాటమాట పెరగడంతో మోనితపై సీరియస్ అయితాడు కార్తీక్. అనవసరంగా నన్ను రెచ్చగొట్టవంటే రచ్చ రచ్చ చేస్తానని మోనిత తెలపగా కార్తీక్ షాక్‌తో తలపట్టుకోగా వెంటనే దీపకు వీడియో కాల్ చేస్తుంది మోనిత. దీప సౌందర్య పక్కనే కూర్చుని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ‘ఇదిగో దీపా..’ అనేసరికి కార్తీక్ షాక్ అవుతాడు. ‘ఈ చీరల్లో నీకు ఏ చీర నచ్చిందో మన కార్తీక్ అడగమన్నాడు’ అంటుంది మోనిత. దీంతో కార్తీక్ బిత్తరపోగా దీప కోపంగా చూస్తూ ఫోన్ కట్ చేస్తుంది. కార్తీక్ కూడా కోపంగా అక్కడనుంచి వెళ్లిపోతాడు.