రైతులకు కేసీఆర్ కన్నతల్లి అయితే.. రేవంత్ రెడ్డి సవతి తల్లి లాంటోడు అని మండిపడ్డారు బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన ఆయన..రైతు బంధు, రైతు భరోసా అనేది రైతులకు సహాయం లాంటిది.. అలాంటి సహాయం చేసి బజారులో సంబరాలు చేసుకోవడం సహాయం అంటారా చెప్పాలన్నారు. కన్నతల్లి బిడ్డకు ఆకలి వేసినప్పుడు నాలుగు గోడల మధ్యల అన్నం పెడుతుంది.. కానీ సవతి తల్లి నలుగురికి తెలిసేలాగా బజారులో భోజనం పెడుతుంది అన్నారు.
కన్నతల్లి బిడ్డ కడుపు నిండిందా లేదా అని చూస్తుంది.. కానీ సవతి తల్లి నలుగురు చూస్తున్నారా లేదా అని చూస్తుంది …ఈరోజు కేసీఆర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి తేడా కన్నతల్లికి, సవతితల్లికి వున్నట్లే ఉన్నది అన్నారు. రంగారెడ్డి జిల్లా పట్ల రైతుల పట్ల ఎందుకింత వివక్ష రేవంత్ రెడ్డి… నిన్న ఉదయం వరకు కూడా రంగారెడ్డి జిల్లాలోని రైతులకు రైతుబంధు డబ్బులు వేయలేదు అన్నారు.
నిన్న కొందరు రైతులకు వేసి, చాలా మంది రైతులు సాగు చేయలేదని సాకు చూపించి రైతుబంధు డబ్బులు వేయకుండా చేతులు దులుపుకున్నారు… సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి వెళ్లే చేవెళ్ల రోడ్డు అద్వానంగా మారి, ప్రమాదాలు అవుతున్నాయని చెప్పినా పట్టించుకోవడం లేదు అన్నారు. రంగారెడ్డి జిల్లా అనేది ఒకటి ఉన్నది అనే విషయం కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తుందా..? చెప్పాలన్నారు.
ఇక్కడ మీకు సీట్లు, ఓట్లు రాకపోవచ్చు.. కానీ ఇక్కడ ఉన్న ప్రజలు తెలంగాణ ప్రజలే… ఇక్కడ ప్రజలు పన్ను కట్టేది తెలంగాణ ప్రభుత్వానికే అన్నారు. భారత దేశంలో హర్యానాలో ఉన్న గుర్గామ్ తరవాత తలసరి ఆదాయంలో రెండో స్థానంలో నిలిచిన ఘనత రంగారెడ్డి జిల్లాదే… భారతదేశానికి వనరులు సమకూర్చే టాప్ 5 జిల్లాలో రంగారెడ్డి జిల్లా ఒకటి … తెలంగాణకు సగం పైన ఆదాయం రంగారెడ్డి జిల్లా ద్వారానే వస్తుంది – బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి పెట్టుబడి సహాయం ఇవ్వకుండా రైతు పొలం ఎలా దున్నుతాడు? చెప్పాలన్నారు.
రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక రైతు తనకు 10 ఎకరాలు ఉందని, కానీ కేవలం 2 ఎకరాలకు మాత్రమే రైతుబంధు వేశారని, అదేంటని అడిగితే నువ్వు రెండెకరాల మాత్రమే దున్నావని, అందుకే మిగతా 8 ఎకరాలకు రైతుబంధు వేయలేదని అధికారులు చెప్పారంటూ బాధపడుతున్నాడు… అసలు మీరు పెట్టుబడి సహాయం అందించకుండా రైతు సాగు ఎలా చేస్తాడు? చెప్పాలన్నారు.
Also Read:వీడియో..అంతరిక్షం నుండి శుభాంశు

