కొండా వ్యాఖ్యలపై కార్తీక్ రెడ్డి సెటైర్

7
- Advertisement -

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేవెళ్ల రోడ్డు విస్తరణ పనులు మొదలయ్యాయి అని అసెంబ్లీలో చెప్పాడు.. కానీ ఈరోజుకు కూడా రోడ్డు పనులు మొదలవ్వలేదు అన్నారు బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి. చేవెళ్ల రోడ్డు విస్తరణ పనులపై మేము ఎప్పుడు ప్రశ్నించిన ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు అబద్ధాలు చెప్తూ వచ్చారు… 9 నెలల కిందట కూరగాయలు అమ్ముకునే వారిపై నుండి లారీ పోయి చాలా మంది చనిపోయారు అన్నారు.

ఆ సమయంలో మేము నిరసన తెలిపితే ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే వారంలో రోడ్డు పనులు మొదలెడుతాం అని అన్నారు.. నెలలు గడుస్తున్నా పనులు మొదలవ్వలేదు అన్నారు. రోడ్లు బాగుంటే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అంటున్నాడు.. తిండి లేకుంటే బాగుండు ఆకలి అవ్వదు, ఇల్లు లేకపోతే బాగుండు హైడ్రా కూల్చదు, కరెంట్ లేకుంటే బాగుండు కరెంట్ షాక్ కొట్టదు అని చెప్పే లాగా ఉన్నాడు అన్నారు.

ఇలాంటి తెలివైన నాయకులు ఉన్నారు బీజేపీలో –బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కి షార్ట్ టర్మ్ మెమొరీ లాస్ ఉంది ఏమో అనిపిస్తుంది … ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం అవ్వట్లేదు అన్నారు. ఆసుపత్రిలో 20 మంది చనిపోయి పడి ఉంటే.. ఏడుస్తున్న కుటుంబసభ్యులు ముందు మనసున్న వ్యక్తి రాజకీయాలు మాట్లాడుతారా?… బుద్ది ఉన్న వాడు ఎవరన్న బాధలో ఉన్న కుటుంబాల ముందు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రోడ్డులు మరమ్మతులు చేయలేదని మాట్లాడుతారా? చెప్పాలన్నారు.

Also Read:నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక అవార్డు..

10 సంవత్సరాలలో 5 ఏండ్లు బీజేపీ నుండి నువ్వే కదా అక్కడ ఎంపీగా ఉంది.. అది ఏమో నేషనల్ హైవేస్ … ఈ రెండు సంవత్సరాలు అధికారంలో ఏ పార్టీ ఉంది..? ముఖ్యమంత్రికి గారిని అడగాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఎందుకు అనిపించలేదు? చెప్పాలన్నారు. 2023 సంవత్సరంలో చేవెళ్ల రహదారి విస్తరణకు వ్యతిరేకంగా కేసు గెలిచిన Save Banyan ఆర్గనైజేషన్ సంస్థను అభినందిస్తూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ట్వీట్ చేశాడు…. జాతీయ రహదారుల అలైన్మెంట్ ఇంజనీర్లు చేస్తారని తెలియకుండా ఎంపీ ఎలా అయ్యారు? అని ప్రశ్నించారు.

- Advertisement -